ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పులబాధ తాళలేక నెల్లూరు జిల్లాలో రైతు ఆత్మహత్య... - etv bharat latest updates

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో దారుణం జరిగింది. అప్పుల బాధ తాళలేక  ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల సాగు కోసం బ్యాంకు దగ్గర తీసుకున్న రుణం చెల్లించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

farmer death at nellore district
అప్పులబాధ తాళలేక రైతు మృతి

By

Published : Jun 17, 2020, 7:21 PM IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమల రేగడ గ్రామానికి చెందిన రైతు ఒంగురు రమణారెడ్డి(80) పంటలను సాగుచేసేందుకు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. పంటలు సాగు చేసే పరిస్థితి లేక, బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించే దారిలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోని వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని బంధువుల నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details