నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ కమ్మపాళానికి చెందిన వెంకయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. తనను వ్యవసాయం చేసుకోనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవటంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు వాపోయాడు. కనీసం కలెక్టరైనా తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - suicide news in Nellore district
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెనికి చెందిన రైతు వెంకయ్య కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తన పొలంలో వ్యవసాయం చేసుకొనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరాడు.
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం