ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా చావుకు వాళ్లే కారణం.. బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్ - Nellore District news

Nellore District Farmer Selfie Video Hullchal: ఓ రైతు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వీడియో సంచలనంగా మారింది. పొలం విషయంలో కోర్టులో ఇద్దరి మధ్య వివాదం నడుస్తుండగా.. వైసీపీ ఎమ్మెల్యే, పోలీసుల అండదండలతో పట్టాభి రామిరెడ్డి అనే వ్యక్తి తమ పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడని బాధితుడు ఆవేదన చెందుతూ..తన చావుకు కారణం వైసీపీ నాయకులు, పోలీసులే అంటూ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఫోన్‌ స్విచాఫ్​ చేసి కనిపించకుండాపోయాడు.

Nellore District
నరసింహారెడ్డి

By

Published : Jan 29, 2023, 7:30 PM IST

Nellore District Farmer Selfie Video Hullchal: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పాతపాడు గ్రామానికి చెందిన రైతు అల్లంపాటి పెంచలరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. వంశపార్యపరంగా వస్తున్న తమ పొలం విషయంలో కోర్టులో కేసు నడుస్తుండగా.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, పోలీసుల అండదండలతో బెంగళూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న.. పట్టాభి రామిరెడ్డి అనే వ్యక్తి తమ పొలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడని బాధితుడు ఆవేదన చెందాడు.. తన చావుకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, పోలీసులే కారణమంటూ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. ఫోన్‌ స్విచాఫ్​ చేసి కనిపించకుండాపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నరసింహారెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దాడి చేసిన స్థానిక వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనను, తన కొడుకును వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేయకుండా రోజు స్టేషన్‌కి పిలిపించి.. పొలం వదులుకోవాలని, పొలం పత్రాలపై సంతకాలు పెట్టాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో నరసింహారెడ్డిపై మరోసారి దాడి చేయడంతో అతను పురుగుల మందు తాగటానికి ప్రయత్నంచాడని తండ్రి కన్నీరుమున్నీరు అయ్యారు.

నా చావుకు వాళ్లే కారణం.. బాధితుడి సెల్ఫీ వీడియో వైరల్

పాతపాడు గ్రామంలో తనకు 636 సర్వే నెంబర్‌లో పిత్రార్జితం కింద 14 ఎకరాల 87 సెంట్లు పొలం ఉంది. ఇటీవల కొంతమంది స్థానిక వైసీపీ నాయకులు రికార్డులను తారుమారు చేసి అక్రమంగా తన పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పొలాన్ని దున్నటానికి ట్రాక్టర్లతో పొలం దగ్గరికి రాగా.. తన కుమారుడు నరసింహారెడ్డి వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ పొలం తమదంటూ నరసింహారెడ్డిపై దాడి చేశారు. -పాటి పెంచలరెడ్డి, నరసింహారెడ్డి తండ్రి

తమ పొలం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ.. తన చావుకి కారణం స్దానిక వైసీపీ ఎమ్మెల్యే, పోలీసులే అంటూ నరసింహారెడ్డి ఓ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ తర్యాత ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్​ చేసి కనిపించకుండాపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..నరసింహారెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details