ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Oxygen plant: ఆత్మకూరుకు ఆక్సిజన్ ప్లాంట్... సోనూసూద్​కు అధికారుల కృతజ్ఞతలు - sonusood oxygen plant for athmakooru

కరోనా కష్టకాలంలో అన్నార్తులకు సహాయం చేసి రియల్ హీరో (real hero)గా పేరు తెచ్చుకున్న సినీ నటుడు సోనూసూద్ (sonu sood) మరో అడుగు ముందుకేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంట్(oxygen plant)​ను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నెల్లూరుకు చెందిన మిత్రబృందం సహాయంతో ప్రత్యేక వాహనంలో పంపించిన ఆక్సిజన్ ప్లాంట్​ ఇవాళ ఆత్మకూరు చేరుకుంది. ఈ సందర్భంగా రియల్ హీరోకు అధికారులు, ఆస్పత్రి సిబ్బంది కృతజ్ఞతలు (thanks) తెలిపారు.

ఆత్మకూరుకు ఆక్సిజన్ ప్లాంట్
ఆత్మకూరుకు ఆక్సిజన్ ప్లాంట్

By

Published : Jul 5, 2021, 10:44 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు సినీ నటుడు సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపించిన ఆక్సిజన్ ప్లాంట్​ను... నెల్లూరుకు చెందిన సోనూసూద్ మిత్ర బృందం ఆస్పత్రి అధికారులకు అప్పగించారు. ఆక్సిజన్ ప్లాంట్​ను తీసుకువచ్చిన ప్రత్యేక వాహనానికి... ఆత్మకూరు ఆర్డీఓ చరిత్ర వర్షిణి, జిల్లా వైద్యశాల అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరోనా రోగుల ఇబ్బందులు తీర్చేందుకు...

జిల్లాలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న సమయంలో... ఆక్సిజన్ అందక కొవిడ్ బాధితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నెల్లూరుకు చెందిన సోనూసూద్ మిత్రుడు సమీర్​ఖాన్ తెలిపారు. వీరి అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ లు అందించాలని సోనూసూద్​ను కోరామన్నారు. తమ అభ్యర్థనను మన్నించిన సోనూసూద్... జిల్లా ప్రజల కోసం ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ నే పంపించారని సమీర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.

అధికారుల కృతజ్ఞతలు...

సోనూసూద్ దాతృత్వం చేసిన ఆక్సిజన్ ప్లాంట్... జిల్లాకు చేరుకోవడానికి కలెక్టర్ చక్రధర్ బాబు, మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్​లు ఎంతో కృషి చేశారని సమీర్​ఖాన్ తెలిపారు. ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు ప్రాణవాయువు ప్లాంట్ అందించినందుకు సోనూసూద్​కు ఆస్పత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి కృతక్షతలు చెప్పారు. అనంతరం రియల్ హీరో సోనూసూద్... అధికారులు, వైద్య సిబ్బందితో ఫోన్​లో మాట్లాడారు.

ఇదీ చదవండి:

Sonu Sood: ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు..​ తెలుగులో ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details