ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం.. మృతదేహం కోసం ఎదురుచూపులు - crime news in nellore district

నెల్లూరు జిల్లాలో జరిగిన కెమికల్ కర్మాగారం ప్రమాదంలో మృతి చెందిన హఫీజ్ మృతదేహాన్ని అప్పగించటం లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో చెన్నై వైద్యులు అప్పగించేందుకు నిరాకరించినట్లు సమాచారం.

nellore chemical factory fire accident
nellore chemical factory fire accident

By

Published : Aug 1, 2020, 6:02 PM IST

Updated : Aug 1, 2020, 7:34 PM IST

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలోని కెమికల్ కర్మాగారం ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా...మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

మృతదేహాం కోసం ఎదురుచూపులు

ఈ దుర్ఘటనలో చనిపోయిన హఫీజ్ (31) మృతదేహం కోసం భార్య, పిల్లలతో పాటు బంధువులు చెన్నైలో పడిగాపులు కాస్తున్నారు. అయితే మృతి చెందిన హఫీజ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చివరి చూపైనా దక్కుతాయో లేదోనని కన్నీటిపర్యంతమవుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన హఫీజ్ కు ఐదేళ్ల కిందట వివాహం కాగా..ఇద్దరు సంతానం ఉన్నారు.

ఇదీ చదవండి

విశాఖ హెచ్​ఎస్​ఎల్​లో ఘోర ప్రమాదం...11 మంది మృతి

Last Updated : Aug 1, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details