పోలీస్నంటూ వసూళ్లు...ఎట్టకేలకు కటకటాల్లోకి.. - fake-police-arrested-by-nellore distric police
పోలీసునంటూ అమాయకుల నుంచి డబ్బును దోచుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయటంతో కోవూరు సాలుచింతల ప్రాంతంలో నివాసముండే షఫీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 60 వేల రూపాయల నగదును స్వాధీనం చేశారు.
అమాయకులను దోచుకుంటున్న ఓ నకిలీ పోలీస్ నెల్లూరులో అరెస్టయ్యాడు. రెండు రోజుల క్రితం చిన్న బజార్ ప్రాంతంలో ఓ బేల్దారిని తాను పోలీస్ అంటూ బెదిరింది 13 వేల రూపాయల నగదును లాక్కెళ్లినట్లు చిన్న బజారు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై నిఘా ఉంచిన పోలీసులు... కోవూరు సాలుచింతల ప్రాంతంలో నివాసముండే షఫీ అనే దొంగను అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా గత కొంత కాలంగా జిల్లాలో పోలీసునంటూ నేరాలకు పాల్పడుతున్న విషయాన్ని షపీ అంగీరరించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. విలాసాలకు అలవాటుపడి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితుడి నుంచి 60 వేల నగదును రికవరీ చేశారు.