ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fake Fingerprints Gang: నకిలీ వేలిముద్రలతో డబ్బు మాయం.. నెల్లూరులో ముఠా అరెస్టు - నకిలీ వేలిముద్రలతో డబ్బు చోరీ

Fake Fingerprints Gang Arrest: ఈ-కేవైసీలు, రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో సహజంగా వేలిముద్రలు వేస్తుంటారు. అయితే రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో వేలిముద్రలు సేకరించి.. వాటితో నకిలీ వేలిముద్రలను తయారు చేసి డబ్బును అపహరిస్తున్న సైబర్​ నేరగాళ్ల ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు.

Fake Finger Prints Gang Arrest
Fake Finger Prints Gang Arrest

By

Published : Jun 27, 2023, 7:25 PM IST

Fake Fingerprints Gang Arrest: చాలా మంది కొత్త సిమ్​ కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు, రిజిస్ట్రేషన్​ కార్యాలయ్యాల్లో సైతం వేలిముద్రలు వేస్తుంటారు. అయితే రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో ఉన్న వేలిముద్రలను సైబర్​ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సేకరించిన వేలిముద్రలకు బదులుగా నకిలీవి తయారు చేసి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును అపహరిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఫిర్యాదుతో ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

నకిలీ వేలిముద్రల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి ల్యాప్​టాప్​లు, ప్రింటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 51.25 లక్షల రూపాయల నగదు కాజేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంను దుర్వినియోగం చేస్తూ ఈ ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతోందని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు.

బాధితురాలు బ్యాంకుకు వెళ్లి అకౌంట్​ చెక్​ చేసుకోగా అందులో డబ్బులు డ్రా అయినట్లు తెలియగా.. అందులోనూ అకౌంట్ నుంచి నగదు డ్రా అయినట్లు మెసేజ్ కూడా రాకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేపట్టిన నెల్లూరు రూరల్ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా గతంలో లీకైన వేలిముద్రల ఆధారంగా ఈ ముఠా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బయోమెట్రిక్​ను లాక్​ చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అంటే ఏమిటి: ఏటీఎం కేంద్రాలు లేని చోట్ల కూడా ఖాతాదారులు డబ్బును తీసుకోవడం లేదా జమ చేయడం తదితర సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి వీలుగా బ్యాంకులు ‘ఏఇపీఎస్‌’(ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం)ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రైవేటు వ్యక్తులకు ‘కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌’ (సీఎస్‌పీ)లు పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు. ఆయా కేంద్రాలు నిర్వహించే వారికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అందించారు. బ్యాంకు ఖాతాదారులు ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేసి వారి ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఎవరి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానమై ఉంటుందో వారికి మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులో ఉంది.

బయోమెట్రిక్​ 'లాక్'​ చేసుకోకపోవడమే..: బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. ఆ విధంగా అనుసంధానం చేసుకున్న వారు వారి బయోమెట్రిక్​ను ‘లాక్‌’ చేసిన స్థితిలో ఉంచాలి. బ్యాంకు అధికారులకు చెప్పి కూడా ఆధార్‌ వివరాలను లాక్‌ చేయించుకోవచ్చు. ఆ విధంగా చేసినట్లైతే ఖాతాదారుల ఆధార్‌ ఆధారంగా ఇతరులు ఎలాంటి లావాదేవీలు నడపడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఏమైనా లావాదేవీలు నిర్వహించాల్సి వస్తే ముందుగా ఖాతాదారులకు ఇన్ఫర్​మేషన్​ వస్తుంది. చాలామంది బ్యాంకు ఖాతాదారులు వారి ఆధార్‌ వివరాలను ‘లాక్‌’ చేయించుకోవడంలో విఫలమవుతుండటం సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారుతోంది.

ABOUT THE AUTHOR

...view details