ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమాజ సేవ విత్ ఫేస్​బుక్

ఫేస్​బుక్.. ఎంతోమందికి వినోద సాధనం. ఫొటోలు తీసుకోవడం.. అప్​లోడ్ చేయడం.. ఆనందించడం. ఇందుకోసమే చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫేస్​బుక్​ను మాధ్యమంగా ఉపయోగిస్తూ.. ఎంతోమందికి సాయపడుతున్నాడు.

By

Published : Jun 7, 2019, 7:29 PM IST

సమాజ సేవ విత్ ఫేస్​బుక్

సమాజ సేవ విత్ ఫేస్​బుక్

సామాజిక మాధ్యమాలతో వినోదాలే కాదు.. సేవా కార్యక్రమాలూ విజయవంతంగా చేయొచ్చని నిరూపిస్తున్నారు.. నెల్లూరుకు చెందిన రసూల్. చదివింది ఇంటరే అయినా.. సమాజ సేవలో మాత్రం నిరంతరం ముందుంటున్నారు. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. 20 ఏళ్ల కింద ఏడుగురితో రూడ్స్ సేవా సంస్థ స్థాపించిన ఆయన.. వైద్య శిబిరాలు, నిత్యావసరాల పంపిణీ చేసేవారు. అనంతరం.. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి సాయంతో పాటు, ప్రభుత్వ పథకాలు పేదలకు చేర్చడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సేవలను ఎక్కువ మందికి చేర్చేందుకు.. సామాజిక మాధ్యమ బాటలో వెళ్లిన రసూల్... ఫేస్​బుక్​లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశారు. 5 వేల మంది దాతలను అందులో సభ్యులుగా చేశారు. పదేళ్లలోనే 80 లక్షల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రూడ్స్ కోసం.. రసూల్ తో పాటు 15 మంది క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వీళ్లు.. సహాయం అర్థించే వారి వీడియోలు తీసి ఫేస్​బుక్ లో పెడతారు. బ్యాంక్ అకౌంట్, చిరునామా ఇస్తారు. దాతలు పరిశీలించి నేరుగా.. బాధితులకే ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.

సేవకు.. సామాజిక మాధ్యమాన్ని జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని రసూల్.. ఆచరణలో చూపిస్తున్నారు.

ఇవీ చదవండి..

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details