ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్లు అమ్మే దుకాణాలపై ఎక్సైజ్​ శాఖ దాడులు - nellore district latest news

ఆత్మకూరులో శానిటైజర్లు అమ్మే దుకాణాలపై ఎక్సైజ్​ శాఖ సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. శానిటైజర్లు కొనేవారి వివరాలను నమోదు చేయాలని దుకాణ దారులకు సూచించారు. పట్టణంలోని కొన్ని షాపుల నుంచి నమూనాలను సేకరించారు.

excise officers take rides on atmakuru sanitizer shops in nellore district
శానిటైజర్లు అమ్ముతున్న దుకాణాలపై ఎక్సైజ్​ శాఖ పోలీసులు తనిఖీలు

By

Published : Aug 17, 2020, 11:16 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శానిటైజర్​ అమ్మకాలు జరిపే దుకాణాలపై ఎక్సైజ్​ శాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొందరు శానిటైజర్లు తాగి ఇటీవల రాష్ట్రంలో మరణాలు సంభవించడం వల్ల పట్టణంలో అమ్మే షాపులపై ఎక్సైజ్​ సీఐ బాలకృష్ణ దాడులు చేశారు.

శానిటైజర్ కొనుగోలు చేసే వారి వివరాలు నమోదు చేసుకొని అనంతరం అమ్మాలని వ్యాపారులకు సీఐ చెప్పినట్లు వివరించారు. ప్రాణహాని ఉన్న శానిటైజర్లు ఎవ్వరూ తాగవద్దని మందుబాబులకు సూచించారు. దుకాణాల్లో కొన్ని నమూనాలను సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details