నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండల తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవూరు శాసన సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి.. ఎస్పీని తిట్టడం కేవలం సంచలనం కోసం మాత్రమే అని తెలిపారు. ఎస్పీని బిహార్ ఫ్యాక్షనిస్ట్తో పోల్చడం అత్యంత అవమానకర విషయమన్నారు. ఇలాంటి వ్యక్తులపై కేసు ఎందుకు పెట్టకూడదంటూ ప్రభుత్వాన్ని పోలంరెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ పరిధిలో మండలానికో వ్యక్తిని పెట్టి దోచుకుంటున్నారని విమర్శించారు.
'వార్తల్లో నిలవడం కోసమే ఎస్పీని తిట్టారు' - మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌పై ధ్వజం
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు చేశారు. సంచలనాల కోసమే ఆయన ఎస్పీని తిట్టారని అన్నారు. అతని మీద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'వార్తల్లో నిలవడం కోసమే ఎస్పీని తిట్టారు'