ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెన్నా వారధి పనుల పూర్తికి ఎన్నేళ్లు కావాలి?' - తెదేపా నేతలు, రైతుల కలిసి నెల్లూరు పెన్నా వారధి పనులు పరిశీలన

చంద్రబాబు పాలనలో పెన్నా వారధి పనులు 95 శాతం పూర్తవగా.. మిగిలిన ఐదు శాతం పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెల్లూరు ప్రజల సమస్యలు స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలకు పట్టవా అని మండిపడ్డారు.

penna bridge visit
పెన్నా వారధి పరిశీలన

By

Published : Dec 26, 2020, 5:45 PM IST

నెల్లూరులో జరుగుతున్న పెన్నా వారధి పనులను.. తెదేపా నాయకులు, రైతులతో కలిసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. చంద్రబాబు హయాంలో 95 శాతం పనులు పూర్తయితే.. మిగిలిన ఐదు శాతం పూర్తి చేయడానికి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

ఈ ఆనకట్ట పరిధిలో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నవంబర్​లో వరదలకు గండ్లు పడగా.. పూడ్చటానికి ఎంత సమయం కావాలని నిలదీశారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details