ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే సహించేది లేదు: సోమిరెడ్డి - చెర్లోపల్లి ఘటనపై సోమిరెడ్డి వ్యాఖ్యలు

వైకాపా ప్రభుత్వంలో పేదలకు రక్షణ, మానసిక ప్రశాంతత కరవైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదమనుకుంటూ అడ్డగోలుగా వ్యవహరించడం అధికారులకు తగదని హితవు పలికారు. ప్రజలను టార్గెట్ చేస్తూ.. ఇబ్బంది పెడితే సహించేది లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

ex minister somireddy chandramohan reddy comments on ysrcp govt
ex minister somireddy chandramohan reddy comments on ysrcp govt

By

Published : Jun 21, 2020, 10:48 PM IST

తెదేపా మద్దతుదారులను వెంటాడి వేధిస్తారా..? అని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ప్రశ్నించారు. కొందరు అధికారుల పనితీరుకు పరాకాష్ట నెల్లూరు జిల్లా చెర్లోపల్లి ఘటన అని మండిపడ్డారు. బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేసి దళిత మహిళలు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులు తేవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చెర్లోపల్లే కాదు.. నిడిగుంటపాళెం, గుడ్లూరువారిపాళెం, ముదిగేడు తదితర అన్ని ప్రాంతాల్లోనూ దళితులు, గిరిజనులు, బీసీలను టార్గెట్ చేయడం అన్యాయమన్నారు. దళిత, గిరిజన, బడుగుబలహీన వర్గాల ప్రజల జోలికి వెళ్లొద్దని మరోసారి అధికారులను కోరారు. వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే సహించేది లేదని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details