ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వేపల్లి రిజర్వాయర్ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు: సోమిరెడ్డి - submerged crops in nellore

TDP Leader Somireddy : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంట నష్టాలను పరిశీలించారు. టీడీపీ బృందంతో కలిసి ముత్తుకూరు మండలంలో తుపాన్​కు నీట మునిగిన పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట నష్టం జరిగిందని విమర్శించారు.

SOMIREDDY
మాజీ మంత్రి సోమిరెడ్డి

By

Published : Dec 14, 2022, 9:43 PM IST

TDP Leader Somireddy: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నీట మునిగిన పంట నష్టాలను టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. వరి పొలాలన్నీ చెరువులయ్యాయని టీడీపీ బృందానికి రైతులు వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట నష్టం జరిగిందని సోమిరెడ్డి విమర్శించారు. మూడేళ్ల నుంచి సర్వేపల్లి రిజర్వాయర్ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీకి సర్వేపల్లి రిజర్వాయర్ పనులు ఇవ్వడం వల్లనే జరిగిందని మండిపడ్డారు. వరకవిపూడి చెరువు కలుజు ఎత్తు పెంచడం వల్ల ఏడు గ్రామాల్లో 1000 ఎకరాల్లో వరి నాట్లు మునిగిపోయాయని రైతులు తెలిపారు.

బండ్లపాలెంలో వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను రైతులు చూపించారు. సర్వేపల్లి చెరువు పరిధిలోని బండపాలెంలో 200 ఎకరాలు మునిగి కుళ్లిపోయాయని రెైతులు వివరించారు. దళారులు నిలువునా ముంచారని సోమిరెడ్డికి ముత్తుకూరు మండలం బండ్లపాలెంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పంట నష్టాలు... మరోవైపు దళారులు సేకరించిన ధాన్యానికి నగదు చెల్లింపులు లేవని, 30మంది రైతులకు రూ.42లక్షలు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు పొట్టెంపాడుకు చెందిన వెంకయ్య, సురేష్, వెంకటేష్ కనిపించకుండా తిరుగుతున్నారని సోమిరెడ్డికి రైతులు వివరించారు. పంటపాలెం వద్ద వేరుశనగ పంటకు నష్టం జరిగింది. గేట్లు ఎత్తనందున నిండి వరదనీరు వెనక్కి
తన్నడం వల్ల నష్టపోయామని కొందరు రైతులు తెలిపారు.

టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details