అమరావతి పరిరక్షణ కోసం నెల్లూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెదేపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తెదేపా నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. అమరావతి పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకమై ఉద్యమిస్తామంటూ మాజీ మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి తన చేతకాని పాలనతో రాష్ట్రాన్ని స్తంభింపజేశారంటూ దుయ్యబట్టారు. రాజధాని అంశంపై వేసిన జీఎన్‌రావు కమిటీ అర్థం లేని రిపోర్ట్ ఇస్తే... దానిని వైకాపా నాయకులు ముందుగానే ప్రకటించడం ఏమిటంటూ ప్రశ్నించారు.
'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది' - ex minister somireddy attend round table meeting in nellore
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతి పరిరక్షణ కోసం నెల్లూరులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోంది'