నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ.. మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ప్రచారం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్కు ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోందన్నారు. పుర ఎన్నికల్లో కరోనాకు ముందు వేసిన నామినేషన్లు కావటంతో.. ఎన్నికల కమిషన్ మొక్కుబడిగా మిగిలి పోయిందని విమర్శించారు. తుళ్లూరు శపించబడ్డ ప్రాంతమని తాను అప్పట్లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసింది తన మిత్రుడు వైఎస్ రాజశేఖరరెడ్డేనని చింతా మోహన్ గుర్తు చేశారు.
'సీఎం జగన్కు ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోంది' - today Ex Minister Chintamohan latest comments
రాష్ట్రంలో సీఎం జగన్కు ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోందని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.

మాజీ కేంద్రమంత్రి చింతామోహన్