రాష్ట్రలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని సీడబ్ల్యూసీ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలపై విరమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పరిధిలో పర్యటించిన ఆయన తిరుపతి ఉప ఎన్నికలో హస్తం గుర్తుకు ఓటేయాలని సూచించారు. త్వరలో కాంగ్రెస్కు మంచి రోజులు రావడం తథ్యమన్నారు.
రాజధాని భూముల పేరుతో మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలని హితవుపలికారు. భవిష్యత్తులో తిరుపతి, వెంకటగిరి, నాయుడుపేట ప్రాంతాలు.. రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతం అవుతుందని అన్నారు.