లాక్‌డౌన్ సందర్భంగా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. పరిశ్రమలు మూసివేయాలని తామెవ్వరినీ ఆదేశించలేదన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే సిబ్బంది తమ పనులు చేసుకోవచ్చని తెలిపినా...కరోనా భయంతో చాలా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
'పరిశ్రమలు మూసివేయాలని ఆదేశించలేదు' - మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో ఇంటర్వూ
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా.. కల్లోలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి..?. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ETVbharat interview with Minister Mekapati Gautam Reddy on the corona effect current situation in the state.