అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై నెల్లూరు జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించారు. పొట్టేపాలెం, విరువూరు రేవుల నుంచి బుచ్చిరెడ్డిపాలెం మీదుగా వెళ్లే వాహనాలను తనిఖీలు చేశారు. విజిలెన్స్, పోలిస్, మైనింగ్ శాఖ అధికారులు చేపట్టిన ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలతోపాటు, అధిక లోడుతో వెళ్తున్న ఏడు లారీలను పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన లారీలను సీజ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇసుక తరలింపు వాహనాలపై అధికారుల దాడులు - mining
అధిక లోడు, అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై నెల్లూరు జిల్లా అధికారులు దాడులు నిర్వహించారు.
ఇసుక లారీలు