నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఆడియో టేపులు సంచలనంగా మారాయి. 7 నెలల ముందు జీజీహెచ్‌లోని హౌస్ సర్జన్‌ను.. వెద్యాధికారి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడంతో ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణ చేయాలని కమిటీలు నియమించారు.
ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో కమిటీలు విచారణ చేపట్టాయి. ఈ రోజు ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నాయి. ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇద్దరు బాధితులను కమిటీ సభ్యులు విచారించారు. నేరం రుజువైతే అధికారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.