Engineering student death: ఐదు రోజుల కిందట ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదిలో విద్యార్ధిణి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వివాహం కాకుండానే గర్బం దాల్చింది. తల్లిదండ్రులకు భయపడి గర్భస్రావం మాత్రలు వేసుకోవడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక ఐదు రోజులుగా ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. ఘటనపై విస్తృతంగా ప్రచారం కావడంతో నెల్లూరు గ్రామీణ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.
విద్యార్ధిని మృతి తీవ్ర విషాదం: నెల్లూరు గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్ధిని మృతి తీవ్ర విషాదంగా మారింది. కళాశాలలో చదువుతూనే ఓ యువకుడి కారు డ్రైవర్ ప్రేమలోపడి మోసపోయింది. వివాహం కాకుండానే గర్బం దాల్చడంతో ఈ విషాద సంఘటనపై ఏ విధంగా స్పందించాలో అర్థంకాక ఆ తల్లిదండ్రులు ఇంట్లోనే కుమిలిపోతున్నారు. మోసం చేసిన ఆ యువకుడిపై కేసు పెట్టాలంటే ముందుకు రావడం లేదు. తన కుతురుకు జరిగిన ఘటన బయటకు వస్తుందని మనస్సులోనే తల్లడిల్లిపోతున్నారు. ఐదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన జిల్లాలో ప్రచారం కావడంతో ఫిర్యాదు లేకుండానే పోలీసులు సంబంధిత యువకుడిని తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.
కారు డ్రైవర్‌ను ప్రేమించిన యువతి: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని గత కొంతకాలంగా కారు డ్రైవర్‌తో స్నేహంగా ఉంటుందని తెలుస్తోంది. ఆ యువకుడు అనంతసాగరం మండలం లింగంగుంట చెందిన కారు డ్రైవర్ శశిగా పోలీసులు గుర్తించారు. యువకుడిని ఈ రోజు అదుపులోకి తీసుకున్న నెల్లూరు గ్రామీణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ యువకుడి వద్ద ఫోన్, మృతురాలు ఇంజనీరింగ్ విద్యార్ధిని ఫోన్లను పోలీసులు పరిశీలించారు. ఐదు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన యువకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. కారు డ్రైవర్ శశి ఇంజనీరింగ్ విద్యార్ధిణితో కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగించారు. గర్భం దాల్చడంతో విద్యార్ధిని తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడింది. ఐదు రోజుల క్రితం గర్భం తొలగించే యత్నంలో భాగంగా తరగతి గదిలోనే ట్యాబ్లెట్లు వేసుకుంది. అవి వికటించడంతో తీవ్ర రక్తస్రావంతో తరగతి గదిలోనే కోమాలోకి వెళ్లింది. ఆరు నెలలు వయస్సు ఉన్న బేబి రక్తం మడుగులో పడి ఉండటంతో కళాశాల సిబ్బంది ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు జీజీహెచ్‌కి తరలించేలోపు మృతి చెందింది.
పోలీసుల విచారణ: వివాహం కాకుండానే గర్భం దాల్చడంతో మరణించిన విషయాన్నితల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటివరకు సంఘటనను గోప్యంగా ఉంచారు. విద్యార్ధిణి మృతి ఘటన ఆలస్యంగా పోలీసులకు చేరడంతో ఇంజనీరింగ్ విద్యార్ధిణి మరణానికి కారణంపై విచారణ ప్రారంభించారు. ఇంజనీరింగ్ విద్యార్ధినికి వచ్చిన ఫోన్ నెంబర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మోసం చేశారా అనే కోణంలోనూ పోలీసులు కేసును విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: