లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి సూచించారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గండిపాలెం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ ఉండే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. మండలంలో లాక్డౌన్ అమలుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసి పంపాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి గండిపాలెం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఆర్డీవో ఉమాదేవి పరిశీలించారు.
'లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయండి' - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అక్కడ ఉండేవారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు.
atmakur rdo