ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జీజీహెచ్​లో అత్యవసర సేవలు తిరిగి ప్రారంభం - 1500 Corona Cases latest News

రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది. ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు మార్చి 9న గుర్తించారు. అలా జిల్లాలో మొదలైన కరోనా కేసులు..క్రమంగా పెరిగాయి. ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జీజీహెచ్​లోనూ గురువారం నుంచి అత్యవసర సేవలు ప్రారంభం కానున్నాయి.

నెల్లూరు జీజీహెచ్​లో గురువారం నుంచి అత్యవసర సేవలు : జేసీ
నెల్లూరు జీజీహెచ్​లో గురువారం నుంచి అత్యవసర సేవలు : జేసీ

By

Published : Oct 28, 2020, 5:03 AM IST

రాష్ట్రంలోనే తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది. ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన ఓ యువకుడికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు మార్చి 9న అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి క్రమేణా కేసుల సంఖ్య పెరగ్గా.. ఆగస్ట్ - అక్టోబర్ నెలల కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 60 వేలకు చేరాయి.

క్రమేపీ తగ్గుముఖం

ప్రతి రోజు 1200 నుంచి 1500 కేసులు నమోదు కాగా, ఇప్పుడిప్పుడే జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు సైతం రెండు శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98 శాతానికి పెరిగింది. 8 కొవిడ్ ఆస్పత్రుల్లోని చాలా చోట్ల ప్రస్తుతం నాన్ కొవిడ్ సేవలను ప్రారంభిస్తున్నారు.

జేసీ నిర్ణయం..

కొవిడ్ ఆస్పత్రిగా ఉన్న నెల్లూరు జీజీహెచ్​లోనూ గురువారం నుంచి అత్యవసర సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైద్యాధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చూడండి : ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details