నెల్లూరులోని ఆటోనగర్లో ఆక్రమణల తొలగింపునకు అధికారులు రంగం సిద్దం చేశారు. ప్రభుత్వ స్థలంలో పేదలు చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆటోనగర్ విస్తరించడం రోడ్డు కుంచించుకు పోయాయి. రోడ్డు ఇరువైపుల ఉన్న దుకాణాలను తొలగించి రహదారులను విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించేందుకు నెల్లూరు రూరల్ తహసీల్ధార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా దుకాణాల మీదే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమ జీవనాధారన్ని పోగొట్టవద్దంటూ దుకాణదారులు వేడుకుంటున్నారు. దీంతో సీపీఎం నాయకులు, అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
ఆక్రమణలు తొలగింపునకు రంగం సిద్ధం.. అధికారులతో సీపీఎం చర్చలు - ఈరోజు నెల్లూరు జిల్లా తాజా వార్తలు
రోడ్లు విస్తరణలో భాగంగా ఆక్రమణలను కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఎన్నో ఏళ్లుగా దుకాణాలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని, తమ జీవనాధారాలను తొలగించవద్దని దుకాణదారులు కోరుతున్నారు. దీంతో సీపీఎం నాయకులు, అధికారులు చర్చలు జరుపుతున్నారు.
అక్రమణలు తొలిగింపుకు రంగం సిద్ధం