ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్‌శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు - electric employees sports meet at nelore

నెల్లూరు కేంద్రంగా విద్యుత్‌శాఖ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

electric employees state level sports competition
electric employees state level sports competition

By

Published : Mar 23, 2021, 12:41 PM IST

విద్యుత్‌శాఖ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

నిత్యం పని ఒత్తిడితో ఉండే విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ఇచ్చేందుకు నెల్లూరు కేంద్రంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. 13 జిల్లాల ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, డిస్క్‌మ్‌లకు చెందిన 200 మంది ఉద్యోగులుఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ పోటీల్లో చెస్, క్యారమ్స్, టెన్నీస్ క్రీడలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్న తమకు ఇలాంటి క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details