ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం నెల్లూరు ఎస్.పి. ఐశ్వర్య రాస్తోగి ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 4 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. ప్రత్యేక పారామిలటరీ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. అంతే కాకుండా ధన ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుచేశామన్నారు.