నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచార జోరు మెుదలైంది. నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పట్టణంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మంత్రి నారాయణ సతీమణి ఎన్నికల ప్రచారం
By
Published : Mar 12, 2019, 7:34 PM IST
మంత్రి నారాయణ సతీమణి ఎన్నికల ప్రచారం
నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచార జోరు మెుదలైంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారం సాగిస్తూ తమ వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పట్టణంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏడో డివిజన్లో ఇంటింటికి వెళ్లి నారాయణను గెలిపించాలని విన్నవించుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీటవేస్తున్న నారాయణను తిరిగి గెలిపించాలని ఓటర్లను కోరారు.