YSRCP Nellore Rural MLA Kotamreddy Issue: నెల్లూరు జిల్లాలోని వైసీపీలో అసంతృప్తి సెగను చల్లార్చేందుకు నెల్లూరు వచ్చిన వైసీపీ రీజినల్ కో అర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధిష్టానం ఆదేశాలతో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి చర్చలకు పిలిచి బుజ్జగించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో బాలినేని ఆహ్వానించినా కోటంరెడ్డి చర్చించేందుకు రాలేదు. అయితే ఈ చర్చలకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని మాత్రం చర్చలకు పిలవకపోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి చర్చలకు హాజరు కాకపోవడంతో బాలినేని శ్రీనివాసుల రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్‌పై బాలినేని: ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అంటూ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలోకి పోవాలనుకున్న వాళ్లే ఇలాంటివి చెబుతారని బాలినేని ఆరోపిచారు.
నెల్లూరు వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. ఆధారాలు ఉంటే నిరూపించాలి. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డు చేశాడు. అలాంటి కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా..? కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడు. -బాలినేని శ్రీనివాసులు రెడ్డి
అన్నదమ్ముల మధ్య చిచ్చు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన తమ్ముడిని నా వద్దకు పంపారని... తనకు ఇన్‌ఛార్జ్ ఇస్తే... వాళ్ల అన్న తప్పుకుంటారు అన్నట్లు చెప్పారని బాలినేని వెల్లడించారు. అన్నదమ్ముల మధ్య మేం ఎలాంటి చిచ్చు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మంత్రి పదవి కావాలని ఆశపడ్డారని ఆయన తెలిపారు. అయితే జిల్లాకు ఒకరికే మంత్రి పదవి దక్కుతుందని బాలినేని వెల్లడించారు. ఐదారుసార్లు గెలిచిన వారికి కూడా మంత్రి పదవి దక్కలేదని బాలినేని గుర్తుకు చేశారు. పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారా? అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. నా మంత్రి పదవి పోయింది, నేను కూడా బాధపడాలి కదా అంటూ పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి: బాలినేని శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఆధారాలుంటే చూపాలన్న బాలినేని కోరగా... ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు బుధవారం నిరూపిస్తానని ఆయన వెల్లడించారు సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయని తెలిపారు. ఇద్దరి ఉద్యోగాలు పోతాయని ఇప్పటివరకు బయటపెట్టలేదన్న కోటంరెడ్డి.. ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పదని వెల్లడించారు. వైసీపీలో అసంతృప్తి నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలియాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు.
ఇవీ చదంవడి: