నెల్లూరులో విధులు నిర్వహిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. నగరంలోని ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో పంది చనిపోయిందన్న సమాచారంతో దాన్ని తొలగించేందుకు ఐదుగురు పారిశుద్ధ్య సిబ్బంది అక్కడికి వెళ్లారు. పంది కలేబరాన్ని తొలగించి, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆసుపత్రి క్వార్టర్స్‌లో ఉంటున్న సిబ్బందిని శానిటైజర్ అడగడంతో, వారు 'రా' ఫినాయిల్ ఇచ్చారు. ఈ ఫినాయిల్‌లో యాసిడ్ ఉంటుంది.అందులో నీళ్లు కలిపి వాడాలీ...కాని తెలియక కార్మికులు మాత్రం ఈ ఫినాయిల్‌ను నేరుగా వాడడంతో శేషగిరి అనే కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. మిగిలిన కార్మికుల చేతులు కమిలిపోయాయి. దీంతో అప్రమత్తమైన వారు చేతులను నీటితో శుభ్రం చేసుకున్నారు. పడిపోయిన కార్మికుడు శేషగిరిని ఆస్పత్రికి తరలించడంతో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన 'రా' ఫినాయిల్ - latest news of nellore dst sanitation labours
ప్రాణాలకు తెగించి ప్రజలు శుభ్రంగా ఉండాలని సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేడు యావత్‌దేశం సెల్యూట్ చేస్తోంది. ఈ సమయంలో అధికారులు చేసిన చిన్న తప్పుతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు నిండుప్రాణాన్ని కోల్పోయాడు.శానిటైజర్ ఇవ్వమని అడిగితే 'రా' ఫినయిల్ ఇవ్వడంతో ఆయన చనిపోయాడు..ఎలా అనుకుంటున్నారా???
![ప్రాణం తీసిన 'రా' ఫినాయిల్ due to raw phinoil sanitation worker died in nellore dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6861290-666-6861290-1587328375882.jpg)
ప్రాణం తీసిన 'రా' ఫినాయిల్