ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండో డోసు లేక.. ఇళ్లకు తిరుగుముఖం పట్టిన జనం - covid vaccine latest news in nellore

కోవిడ్ టీకా రెండో డోసు ​లేక నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వాక్సిన్​ కోసం వచ్చిన వారంతా తిరిగి ఇళ్లకు వెళ్లారు. వాక్సినేషన్ కేంద్రం వద్ద ఉదయం నుంచే జనం వచ్చినా సరిపడా డోసులు లేవని అధికారులు చెప్పగా.. చేసేది లేక తిరుగుముఖం పట్టారు.

vaccination center in naidupeta nellore
నాయుడుపేటలో వాక్సిన్​ కేంద్రం

By

Published : May 12, 2021, 5:31 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రెండో డోస్​కు సరిపడా కోవిడ్ టీకా లేక... వాక్సినేషన్ కేంద్రానికి వచ్చిన వారిలో కొంతమంది ఇంటిముఖం పట్టారు. పురపాలక సంఘం పరిధిలోని ఎల్.ఎ.సాగరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేస్తున్నారు. మొదటి డోసు వేసుకుని 42రోజుల తరువాత వచ్చిన వారికి వ్యాక్సిన్ వేశారు.

మొదటి డోసు వేసుకున్న వారికి ఇంకా రెండో డోసు వేయకపోవడంతో అక్కడి వైద్య సిబ్బందిని వాక్సిన్ కోసం వచ్చిన వారు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కొందరికి మాత్రమే వేయడంతో మిగిలిన వారంతా ఇంటికి వెళ్లారు. త్వరలోనే మిగిలిన వారికి వాక్సినేషన్​ను పూర్తి చేస్తామని అధికారులు చెబున్నారు. టీకా పంపిణీలో ప్రభుత్వం పనితీరు బాగా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details