ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీనివాసులును భార్యే హతమార్చింది... - DSP pressmeet

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో జరిగిన ఆటో డ్రైవర్ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును  పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా హతుడి భార్య చేవూరు శారదగా గుర్తించారు.

ఆటో డ్రైవర్ హత్య

By

Published : Jun 6, 2019, 2:08 AM IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో జరిగిన ఆటో డ్రైవర్ చేవూరు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు . ఈ కేసులో ప్రధాన ముద్దాయి హతుడు భార్య చేవూరు శారదగా గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన బీరుసీసాలు, తమిళనాడుకి చెందిన అగ్గిపెట్టే ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. శారద ఫోన్ కాల్స్ ఆధారంగా తమిళనాడుకు చెందిన కె.రాజేంద్రన్ తో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని తెలుసుకుని విచారించారు. వీరి ఆ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని మరో ఇద్దరు వ్యక్తులతో సుపారి మాట్లాడుకుని హతమార్చింది. ఒక్కొక్కరికి 5,0000/- రూపాయలకు చెల్లించింది. 28వతేదీ రాత్రి వారు అతి కిరాతకంగా 24కత్తి పోట్లు పొడిచి శ్రీనివాసులుని హతమార్చారు. ముద్దాయి రాజేంద్రన్ విచారణలో అన్నీ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆటో డ్రైవర్ హత్య

ABOUT THE AUTHOR

...view details