నెల్లూరు ఫత్తేఖాన్ పేట వద్ద గతేడాది నవంబర్లో తుపాకీతో కాల్చి వ్యాపారిని హత్య చేసిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1, ఏ2, ఏ6 అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, శుక్రవారం రాత్రి ఏ4 షేక్ సలీం రసీదును పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్లో రాజ్ పురోహిత్ మహేంద్ర సింగ్ అనే వ్యాపారిని తుపాకీతో కాల్చి నిందితులు పరారయ్యారు. అప్పట్లో ఈ విషయం కలకలం సృష్టించడంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండటంతో... వారిని త్వరలోనే పట్టుకుంటామని నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. హత్యకు ఉపయోగించిన తుపాకీలోని ఓ భాగాన్ని, మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు వ్యాపారి హత్య కేసు.. మరో నిందితుడి అరెస్టు - నెల్లూరు నగర డీఎస్పీ మురళీకృష్ణ
గత ఏడాది నవంబరులో నెల్లూరు ఫత్తేఖాన్పేట వద్ద తుపాకీతో కాల్చి వ్యాపారిని హత్య చేసిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
నెల్లూరు నగర డీఎస్పీ మురళీ కృష్ణ