ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలోని లక్ష కుటుంబాలకు ఆయుష్ శాఖ ద్వారా మందులు - నాయుడుపేటలో మందుల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. నెల్లూరు జిల్లాలోనూ దీని ప్రభావం అధికంగా ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలోని లక్ష కుటుంబాలకు ఆయుష్ ద్వారా మందులు పంపిణీ చేస్తామని జిల్లా సీనియర్ వైద్యాధికారి తెలిపారు.

drugs-giving-with-ayush-department-for-one-lakhs-families-in-nellore-district
జిల్లాలోని లక్ష కుటుంబాలకు ఆయుష్ శాఖ ద్వారా మందులు

By

Published : Apr 21, 2020, 4:27 PM IST

నెల్లూరు జిల్లాలోని లక్ష కుటుంబాలకు ఆయుష్ శాఖ ద్వారా మందులు పంపిణీ చేస్తున్నామని జిల్లా సీనియర్ వైద్యాధికారి జనార్దన్ రావు పేర్కొన్నారు. మొదట రెడ్ జోన్ ప్రాంతాల వారికి ఇస్తామన్న ఆయన.. అనంతరం మిగిలిన వారికీ పంపిణీ చేస్తామని తెలిపారు. మొదట వీటిని నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు అందించారు. ఈ మందులతో కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details