cotton cultivation in AP: నెల్లూరు జిల్లాలో గత రెండు, మూడు సంవత్సరాల నుంచి పత్తి సాగుపై రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. విస్తీర్ణం కూడా బాగా పెరుగింది. మినుము, పెసర పంటలతో నష్టం రావడంతో రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపారు. అయితే, ఈ ఏడాది పత్తి పంటపై తెగుళ్లు ఆశించడంతో దిగుబడులు తగ్గుతున్నయన్న ఆవేదనలో రైతులు మునిగిపోయారు. దీనికి తోడు పత్తి ధరలను కూడా వ్యాపారాలు తగ్గిస్తున్నారని రైతులు వెల్లడిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, మర్రిపాడు వింజమూరు, కలిగిరి, అనంతసాగరం, పొదలకూరు రాపూరు తదితర మండలాల లో రైతులు పత్తి పంటపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం గత మూడు సంవత్సరాల పోలిస్తే 30 వేల ఎకరాల్లో ఉన్న పత్తి సాగు దాదాపుగా 70 వేల ఎకరాలకు పెరిగింది. మినుము, పెసర పంటలలో పెట్టుబడులు పెరిగాయని ఆదాయం బాగా తగ్గిందని దీంతో పత్తి సాగు వైపు రైతులు ఆసక్తి చూపాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం పత్తి సాగుతో ఎకరానికి లక్ష రూపాయలు మిగలడంతో, ఈ ఏడాది రైతులు భారీ స్థాయిలో పత్తి సాగు చేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఏడాది భారీగా పెట్టుబడును పెరిగాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఎకరానికి 20 వేల రూపాయలు ఖర్చు అయిందనీ... ఈసారి ఎకరానికి 50 వేల రూపాయలు వరకు పెట్టుబడి పెరిగినట్లు రైతులు అన్నారు. నవంబర్లో కురిసిన వర్షాలకు చాలా చోట్ల పత్తి పంట దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటా 6,500 మాత్రమే అమ్ముతున్నాయని ఈ ధరలు గిట్టుబాటు కాదని రైతులంటున్నారు. కనీసం క్వింటా రూ.8 వేలు అమ్మితే గిట్టుబాటు అవుతుంది అని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది బూడిద తెగులు, దోమ నివారణ ఎక్కువ ఉందని రైతులు పేర్కొన్నారు. దీంతో దిగుబడులు సైతం భారీగా తగ్గుతున్నాయని రైతులంటున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పత్తి రైతుల సమస్యలపై నెల్లూరు జిల్లా శివ నాయక్ ,వ్యవసాయ శాఖ సహాయ సంచాలకు మాట్లాడారు. అపరాల సాగులలో రైతులకు నష్టాలు రావడంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. జిల్లాలో విస్తీర్ణం కూడా భారీ స్థాయిలో పెరుగుతుందన్నారు. గడిచిన రెండు, మూడు సంవత్సరాల నుంచి పత్తి సాగులో అధిక లాభాలు రావడంతో రైతులు పత్తి సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారి శివ నాయక్ అంటున్నారు.
నెల్లూరు జిల్లాలో 30 వేల ఎకరా నుంచి 70 వేల ఎకరాలకు పెరిగిన పత్తి సాగు ఇవీ చదవండి: