నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మద్యం కోసం మందుబాబులు క్యూ కట్టడం మామూలైంది. తాజాగా జాతీయ రహదారికి ఆనుకుని పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు సమీపంలోని మద్యం దుకాణాల వద్ద మందుబాబులు మద్యం కొనుగోళ్లకు ఎగబడ్డారు.
కొవిడ్ నిబంధనలు గాలికి.. మందే ముఖ్యం వీరికి! - నెల్లూరు జిల్లా వార్తలు
కరోనాను సైతం లెక్కచేయకుండా... మాస్కులు ధరించకుండా మందుబాబులు మద్యం దుకాణాలు వద్ద బారులు తీరుతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది.
వెంకటగిరిలో మందుబాబుల క్యూ
సమీపంలోనే కరోనా కంటైన్మెంట్ జోన్ అమలులో ఉన్నా ఇలా మద్యం కోసం మాస్కులు సైతం వాడకుండా బారులు తీరడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ తీసుకుని మద్యం దుకాణాల వద్దకు వచ్చే వారంతా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి:కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు