DRDO chairman Satish reddy visit gandhi ashramam in pallepadu: రెండో సబర్మతిగా పిలిచే నెల్లూరు జిల్లా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. 1921లో మహాత్ముడి చేతులమీదుగా ఏర్పాటైన ఆశ్రమాన్ని సతీశ్‌రెడ్డి సందర్శించారు. అక్కడ కొంతసేపు గడిపారు.
పెన్నానది ప్రవాహానికి ఆశ్రమ భూమి కోతకు గురి అవుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇక‌్కడి జ్ఞాపకాలను భద్రపరిచేలా.. మరింత కృషి చేయాల్సి ఉందని సతీశ్‌రెడ్డి అన్నారు. ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.