నెల్లూరు నగరంలోని 54డివిజన్లలో 8లక్షలకు పైగా జనాభా ఉంది. నగరంలో పలు చోట్ల మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. వెంగళరావునగర్, బీవీనగర్, కొత్తూరు, మూలపేట, బాలాజీనగర్, వెంకటేశ్వరపురం, జనార్దనరెడ్డికాలనీ, జెండా వీధి , కోటమిట్ట ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేదు. లాక్డౌన్ పరిస్థితుల్లో అందరూ ఇళ్ళకే పరిమితం కావడంతో మురుగునీరు ఎక్కువగా చేరింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
స్వచ్ఛతకు ఆమడదూరంలో నెల్లూరు - నెల్లూరు నేటి వార్తలు
నెల్లూరు నగరంలో మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా మారింది. కాలువల్లో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయింది. పూడిక తీయకపోవడంతో చెత్తాచెదారం మేటవేసింది. సిబ్బంది రాకపోవడం, నగరపాలక సంస్థ అధికారులు పర్యవేక్షించకపోవడం, నాయకులు పట్టించకపోవడంతో నగరం దుర్గంధంగా మారింది.
స్వచ్ఛతకు ఆమడదూరంలో నెల్లూరు
మురుగునీటిలో దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇదీచదవండి.