ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

500 కుటుంబాలకు రూ. 5 లక్షల విలువైన సరకుల పంపిణీ - నెల్లూరు జిల్లా బనగానపల్లెలో నిత్యావసరాలు పంపిణీ వార్తలు

లాక్ డౌన్ సమయంలో ఒక దాత.. మంచి మనసు చాటుకున్నాడు. పనుల్లేక ఉపాధి కోల్పోయి తిండికి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకున్నాడు. 500 కుటుంబాలకు బియ్యం, సరకులు అందజేశారు.

donor distribute groceries in banagaanapalle nellore district
పేదలకు సరకులు పంపిణీ చేస్తున్న దాత రవీంద్రారెడ్డి

By

Published : May 27, 2020, 2:38 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బనగానపల్లె పంచాయతీ పరిధిలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లూరి రవీంద్రారెడ్డి రూ. 5 లక్షల విలువ చేసే నిత్యావసర సరకులు వితరణ చేశారు. పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలకు వాటిని అందించారు.

ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, సరకులు, కూరగాయలు అందించారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారని.. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సహాయం అందజేశానన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details