నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతోంది. పాదచారులు నడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇద్దరు చిన్నారులు వీధిలో ఆడుకుంటుండగా...సుమారుగా 8 కుక్కలు స్వైర విహారం చేసి వారిపై తీవ్రంగా దాడి చేశాయి. వెంటనే స్పందించిన స్థానికులు కుక్కలను తరిమేసారు. అనంతరం చిన్నారులను కాపాడి..వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది కుక్కలను పట్టే ప్రయత్నం చేశారు. కొన్ని కుక్కలను పట్టగా కొన్నింటి కోసం గాలిస్తున్నారు. తక్షణమే కుక్కల బెడద నుండి తమను కాపాడాలని స్థానికులు మున్సిపల్ సిబ్బందిని కోరారు.
కుక్కల బెడద నుంచి రక్షించండి!! - నెల్లూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కల బెడద ఎక్కువవుతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి.
![కుక్కల బెడద నుంచి రక్షించండి!!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3731070-461-3731070-1562132269112.jpg)
ఇద్దరు చిన్నారులపై దాడి చేసిన కుక్కలు