నెల్లూరు జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండుగకు ప్రజలు సిద్ధమయ్యారు. పండుగకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే టపాసుల దుకాణాలు వద్ద జనం క్యూ కట్టారు. గతేడాదితో పోలిస్తే బాణసంచా ధరల్లో పెద్దగా తేడా లేదని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టపాకాయల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టటం వల్ల వ్యాపారులూ 'పండుగ' చేసుకుంటున్నారు. తక్కువ కాలుష్యం ఉన్న వాటినే అమ్ముతున్నామని.. చైనా టపాసుల్ని ప్రోత్సహించడం లేదని దుకాణదారులు చెప్పారు.
నెల్లూరు జిల్లాలో మొదలైన దీపావళి సందడి - దీపావళి వార్తలు
దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది టపాసులు. ఎవరు ఎంత చెప్పినా బాణసంచా పేల్చనిదే పండుగ పూర్తికాదు. చిన్నపిల్లలు మొదలుకుని పెద్దవారి వరకూ టపాకాయలు కాల్చడంలోనే పండుగ ఆనందాన్ని పొందుతారు. అందుకే దీపావళి సందర్భంగా వీధివీధినా వెలసిన దుకాణాలతో సందడి మొదలైంది.
![నెల్లూరు జిల్లాలో మొదలైన దీపావళి సందడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4878495-622-4878495-1572098801175.jpg)
నెల్లూరు జిల్లాలో మొదలైన దీపావళి సందడి