నెల్లూరు జిల్లావ్యాప్తంగా అన్నీ బ్యాంకు శాఖల అధికారులు ప్రజల కోసం కష్టపడి వారి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఐటీడీఏ డీర్‌డీఏ, మెప్మా, శాఖల ద్వారా వివిధ పథకాలకు సంబంధించిన రుణాల దరఖాస్తులు ఆగిపోయాయని, వెంటనే వాటిని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
లక్ష్యాలు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో వివిధ పథకాలకు సంబంధించిన రుణాల దరఖాస్తులు ఆగిపోయాయని, వెంటనే వాటిని పరిశీలించాలని బ్యాంకర్లను కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమావేశం జరిగింది.

లక్ష్యాలు త్వరగా పూర్తి చేయండి
ప్రతి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్నతోడు, వైఎస్‌ఆర్ బీమా పథకాల లక్ష్యాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదని, లోపాలను సవరించి వేగంగా చర్యలు చేపట్టాలన్నారు.