నెల్లూరులో రెండో రోజు కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. కోటమిట్ట, జనార్దన్ రెడ్డి కాలనీల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లలో తనిఖీ చేపట్టిన ఆయన.. టీకా పంపిణీకి సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఓ వైపు టీకా పంపిణీ పరిశీలన.. మరోవైపు వాహనాల తనిఖీ - నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు తాజా న్యూస్
నెల్లూరులోని కోటమిట్ట, జనార్దన్ రెడ్డి కాలనీ.. అర్బన్ హెల్త్ సెంటర్లలో రెండో రోజు కొనసాగుతున్న కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. మరోవైపు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి చేరుకున్న సరకుల సరఫరాకు వినియోగించే ప్రత్యేక వాహనాలను తనిఖీ చేశారు. వీటి ద్వారా ఇంటింటికి రేషన్ సరకుల సరఫరాను ఫిబ్రవరి ఒకటి నుంచి చేపట్టనున్నామని వెల్లడించారు.
ఓ వైపు టీకా పంపిణీ పరిశీలన.. మరోవైపు వాహనాల తనిఖీ..
మరోవైపు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి చేరుకున్న సరకుల సరఫరాకు వినియోగించే ప్రత్యేక వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాకు 524 ప్రత్యేక వాహనాలను కేటాయించినట్లు తెలిపారు. వాహనాల పంపిణీకి అధికారులు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1 నుంచి 18వ తేదీ వరకు ఇంటింటికి రేషన్ సరకులు పంపిణీ ఉంటుందన్నారు. ఈనెల 20న వాహనాలను మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు.