ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 27, 2020, 7:56 PM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పద్మాలయ ట్రస్టు నిర్వాహకులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

distribution-of-vegetables-and-essentials-to-the-poor-people-in-nellore-district
పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసర వస్తువులు

పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసరాలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్​లోని వాసిలి గ్రామంలో పద్మాలయ ట్రస్టు సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలు, రైతులకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details