నెల్లూరు జిల్లాలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండో విడత రేషన్ ఏర్పాట్లు చేశామని జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తెలిపారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు వ్యక్తిగత దూరం పాటించాలని కోరారు. దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి మరో రెండు కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలర్ కోడింగ్ విధానం ప్రతి రేషన్ షాపులోనూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కలర్ కూపన్స్ తీసుకున్న లబ్ధిదారులు వారికి కేటాయించిన కౌంటర్ కు మాత్రమే వెళ్లి బియ్యం, శనగలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేపటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ - lockdown in nellore
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని నెల్లూరు జిల్లాలో అమలు చేయనున్నారు. అర్హులైన రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి రెండో విడత రేషన్ బియ్యం, శనగలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తెలిపారు.
నెల్లూరులో జేసీ సమావేశం