ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రాఫ్ట్​ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆర్థిక సహాయంతో నిత్యావసరాల పంపిణీ - ఉదయగిరిలో నిత్యావసర వస్తువుల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నిబంధన కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫలితంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా కార్మికులకు క్రాఫ్ట్​ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆర్థిక సహాయం చేశారు.

Distribution of essentials with the financial assistance of Kraft Consul of Andhra Pradesh
క్రాఫ్ట్​ కొన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహాయంతో నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 21, 2020, 3:58 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి దిలావర్​భాయ్ వీధిలోని చెక్కనగిషీ కేంద్రంలో పనిచేసే 40 మంది మహిళా కార్మికులకు కేంద్రం నిర్వాహకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మంజూరు చేసిన లక్ష రూపాయల నగదుతో ఒక్కో మహిళా కార్మికురాలికి రూ.2200 విలువైన బియ్యం, నిత్యావసర సరకులు అందించారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిన పేదల ఇబ్బందులను క్రాఫ్ట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు స్పందించి నిత్యావసర సరకులకు ఆర్థిక సహాయం చేశారని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details