ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ - నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉపాధ్యాయులు నిత్యావసరాల పంపిణీ చేశారు.

nellore district
యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : Apr 13, 2020, 7:15 PM IST

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన 40 మంది నిరుపేదలకు ఉపాధ్యాయులు నిత్యావసరాల పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి మోహన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి రెడ్డి, జిల్లా నాయకుడు నాయబ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారెడ్డి, ఎలీషా చేతులమీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.500 విలువచేసే నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోందన్నారు. కూలీనాలి పనులు చేసుకుని జీవనం సాగించే నిరుపేదలు ఇళ్లకు పరిమితం కావడం వల్ల ఉపాధి కోల్పోయి జీవనం కష్టంగా మారిందని ఉపాధ్యాయులు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఉండే పేదలకు సహాయం చేయాలని రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు నిధులు సమకూర్చి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది చదవండిహిజ్రాలు, పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ

ABOUT THE AUTHOR

...view details