700 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - 700 కుటుంబాలకు సరుకుల పంపిణీ
కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదగిరిలో ఓ దాత తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
700 కుటుంబాలకు నిత్యావరల సరుకుల పంపిణీ
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగాపల్లి పంచాయతీలోని ఐదు గ్రామల్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన దాత రవీంద్రారెడ్డి రూ.7లక్షల విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై జ్యోతి, వైకాపా మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, తదితరుల చేతుల మీదుగా నిత్యావసర సరకులను ప్రజలకు పంపిణీ చేశారు. లాక్డౌన్లో భాగంగా ఇంటికే పరిమితం అయిన 700 కుటుంబాలకు సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1000 సరకులను అందజేశారు.
ఇదీ చదవండి:
ఆపద సమయంలో ఆసరా..నిరుపేదలకు సహాయం
TAGGED:
700 కుటుంబాలకు సరుకుల పంపిణీ