ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు దుప్పట్ల పంపిణీ - వెంకయ్య స్వామికి నిత్యం పూజలు

మూలపేటలోని వెంకయ్య స్వామి గురు నిలయంలో పేదలకు దుప్పట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వెంకయ్య స్వామి గురు శిష్యుడైన మాకాని వెంకట్రావు పరమపదించడం వల్ల, ఆయన కుమారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Distribution of blankets to the poor
గురు నిలయంలో పేదలకు దుప్పట్ల పంపిణీ

By

Published : Nov 16, 2020, 9:30 PM IST

నెల్లూరు జిల్లా మూలపేటలోని వెంకయ్య స్వామి గురు నిలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రెండేళ్ల క్రితం మాకాని వెంకట్రావు పరమపదించడం వల్ల, ఆయన కుమారులు దుప్పట్లను పంపిణీ చేశారు.

17 ఏళ్లుగా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు మూడు వేల మందికి పైగా దుప్పట్లు అందజేసి, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అక్కడ వెంకయ్య స్వామికి నిత్యం పూజలు చేసి, వందల మందికి అన్నదానం చేస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details