ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరమ్మతులకు గురైన ఆర్టీసీ బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ చోరీ - నెల్లూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో డీజిల్ దొంగతనం

బంగారం, వెండి, నగదే కాదు.. ఇంధనాన్ని సైతం దొంగలు వదిలి పెట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సులో నుంచి 150 లీటర్ల డీజిల్​ను దుండగులు దోచేశారు. దీనిపై​ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్​ తెలిపారు.

diesel-theft-in-apsrtc-bus-by-thieves-at-nellore-district
ఆత్మకూరు డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో చోరీ

By

Published : Dec 17, 2019, 4:08 PM IST

బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ చోరీ

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద మరమ్మతులకు గురై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి దుండగులు డీజిల్​ చోరీకి పాల్పడ్డారు. ప్రతి రోజూ లాగే బస్సును డ్రైవర్​ నందవరం కూడలి వద్ద ఉన్న పెట్రోల్​ బంకు వద్ద వదిలి వెళ్లాడు. తిరిగి ఉదయాన్నే తీసుకొని జంగాలపల్లి వెళ్లి విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా నందవరానికి సమీపంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డీజిల్ ట్యాంకును గమనించగా తాళం పగులగొట్టి ఉండడం వల్ల డీజిల్ చోరీ అయినట్లు గుర్తించాడు. జరిగిన విషయాన్ని డిపో మేనేజర్​కు తెలియజేశాడు. బస్సు నుంచి 150 లీటర్ల డీజిల్​ దొంగతనం చేసినట్లు గుర్తించారు. దీనిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు డిపో మేనేజర్​ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details