ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.5.16 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు - Devinavaratri celebrations news in nellore district

నెల్లూరు జిల్లాలో దేవీశరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా.. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవటానకి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Devinavaratri celebrations
Devinavaratri celebrations

By

Published : Oct 11, 2021, 11:33 AM IST

Updated : Oct 11, 2021, 4:53 PM IST

వైభవంగా శరన్నవరాత్రులు... ధనలక్ష్మి అలంకారంలో దర్శనం

నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు రూ.5.16 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని పాలకవర్గం ముస్తాబు చేశారు. 500, 200, 100, 50, 20, 10 రూపాయల కొత్త నోట్లతోపాటూ ఏడు కేజీల బంగారం, 60 కేజీల వెండితో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో కొలువై ఉందీ.. వాసవి కన్యాకాపరమేశ్వరీ దేవాలయం. ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా వివిధ కళాకృతులతో తీర్చిదిద్దారు. దానికితోడు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయం ప్రాంగణం నుంచి గర్బాలయం వరకు.. ఉపాలయాలు, ఆలయం చుట్టూ కొత్త కరెన్సీ నోట్లతో శోభయమానంగా అలంకరించారు. రూ.5 కోట్ల విలువ కలిగిన నోట్లతో దండలు తయారుచేసి వేశారు. రూ.2వేల నోటు నుంచి రూ.20 నోటు వరకు అలంకరణలో వినియోగించారు.

సుమారు వంద మందికి పైగా వాంలటీర్లు ఆలయాన్ని నోట్లతో ముస్తాబు చేశారు. ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి

దసరా ఉత్సవాలు: నేడు అన్నపూర్ణా, మహాలక్ష్మీదేవి రూపాల్లో అమ్మవారు

Last Updated : Oct 11, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details