ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు విచారకరం: సోమిరెడ్డి - చంద్రబాబుపై రాళ్ల దాడి వార్తలు

చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు విచారకరమని తెదేపా నేత సోమిరెడ్డి అన్నారు. రాళ్లు, చెప్పులతో ఎవరైనా నిరసన తెలుపవచ్చు అని ఆదేశాలు జారీ చేయగలరా అన్ని ప్రశ్నించారు.

somireddy
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Nov 29, 2019, 8:39 PM IST

మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రక్షణ కల్పించలేకపోవడం దారుణమని ఆయన నెల్లూరులో అన్నారు. వైకాపా కార్యకర్తలు ముందుగానే చెప్పి దాడి చేసినా... అరికట్టలేకపోవడం పోలీసుల వైఫల్యమని చెప్పారు. రాళ్లు, చెప్పులతో దాడి జరిగితే... నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని డీజీపీ మాట్లాడటం విచారకరమన్నారు. రాళ్లు, చెప్పులతో ఎవరైనా నిరసన తెలియజేయవచ్చని డీజీపీ ఆదేశాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి
దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



ABOUT THE AUTHOR

...view details